About

banner image
Seo Services

దగ్గినప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంటుందా.. అయితే ఈ డేంజర్ వ్యాధి ఉందేమో జాగ్రత్త..

అనేది లంగ్ ఇన్ఫెక్షన్. దీని లక్షణాలు మైల్డ్ నుంచి సివియర్ గా ఉండొచ్చు. సివియర్ గా లక్షణాలున్నట్టయితే హాస్పటల్ కు వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ లంగ్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు అలాగే అరవై ఐదేళ్లు దాటిన పెద్దలు ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే, ఈ ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తి వారి ఇమ్యూన్ సిస్టమ్ కు ఉండకపోవచ్చు. న్యూమోనియా దేని వల్ల వచ్చింది అన్న ఫ్యాక్టర్ తో పాటు మీ వయసు అలాగే మీ హెల్త్ కండిషన్ పై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఈ లక్షణాలు మెల్లమెల్లగా డెవెలప్ అవుతూ ఉంటాయి. సాధారణ న్యూమోనియా లక్షణాలిలా ఉంటాయి: 1. శ్వాస తీసుకుంటున్నప్పుడు అలాగే దగ్గుతున్నప్పుడు చెస్ట్ పెయిన్ 2. మ్యూకస్ దగ్గు 3. విపరీతమైన అలసట అలాగే ఆకలి లేకపోవడం 4. ఫీవర్, చెమటలు అలాగే చలి 5. వికారం, వాంతులు అలాగే విరేచనాలు 6. శ్వాస అందకపోవడం ఈ లక్షణాలతో పాటు వయసులో పెద్దవారిలో అలాగే బలహీనమైన ఇమ్యూన్ సిస్టమ్ కలిగినవారిలో ఇంకొన్ని లక్షణాలుంటాయి. గందరగోళంగా ఉంటుంది వారి మానసిక స్థితి. వారి బాడీ టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. న్యూబర్న్స్ అలాగే ఇంఫాంట్స్ లో ఇన్ఫెక్షన్ కు సంబంధించిన లక్షణాలు కనిపించవు. వారు వామిట్ చేసుకోవచ్చు. అలాగే వారిలో వికారం, జ్వరం, దగ్గు, విపరీతమైన అలసట కనిపించవచ్చు. మీకు కొత్తగా దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా అలాగే శ్వాస అందకపోవడం వంటి సమస్యలు ఎదురైనా అది కోవిద్-19 కావచ్చు. న్యూ కరోనా వైరస్ కి సంబంధించిన అనారోగ్యం న్యుమోనియాకు దారితీసే అవకాశం ఉంది. న్యూమోనియా కారణాలు: బాక్టీరియా, వైరస్లు లేదా ఫంగై వంటి వాటివల్ల న్యుమోనియా రావచ్చు. సాధారణ కారణాలనేవి ఇవి కావొచ్చు: 1. ఫ్లూ వైరస్ 2. కోల్డ్ వైరస్ 3. ఆర్ ఎస్ వీ వైరస్ (ఒక ఏడాది కంటే చిన్నపిల్లల్లో న్యుమోనియాకు దారితీసే ప్రధాన కారణమిది) 4. స్ట్రెప్టోకొక్కాస్ న్యుమోనియా అలాగే మైకోప్లాస్మా న్యుమోనియా బాక్టీరియా కొంతమందికి వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యుమోనియా వస్తుంది. వారు వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటారు. హాస్పటల్ లో ఉన్నప్పుడు న్యుమోనియా వచ్చినప్పుడు వెంటిలేటర్ అవసరం లేనప్పుడు హాస్పటల్ అక్వయిర్డ్ న్యుమోనియా అనంటారు. చాలామందికి కమ్యూనిటీ అక్వయిర్డ్ న్యుమోనియా వస్తుంది. అంటే హాస్పటల్ లో ఈ ఇన్ఫెక్షన్ సోకలేదని అర్థం. వైద్యులు మీకు సమస్య ఉందని నిర్థారించాక వారిచ్చిన ప్రిస్క్రిప్షన్ ను మీరు ఫాలో అవుతారు. లంగ్స్ అనేవి ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తిని తెచ్చుకుంటాయి. ఈలోగా మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సమస్య నుంచి కాస్తలో కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇంట్లోనే ఉండండి: ఇంట్లోనే హీలింగ్ అనేది సౌకర్యవంతంగా జరుగుతుంది. స్కూల్ అలాగే ఆఫీస్ వర్క్ నుంచి దూరంగా ఉండండి. జ్వరంతో పాటు దగ్గు తగ్గేవరకూ ప్రికాషన్స్ తీసుకోండి. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వేరొకరికి సోకకుండా జాగ్రత్త తీసుకోగలుగుతారు. మీకు మీరుగా సురక్షితంగా ఉన్నవారవుతారు. కొన్ని వర్క్స్ కు దూరంగా ఉండండి: ఇంట్లోనే ఉండడం అలాగే విశ్రాంతి తీసుకోవడం అనేవి రెండు వేరు వేరు కాన్సెప్ట్స్. ఈ సమయంలో ఇంట్లోని వార్డ్ రోబ్స్ లోని దుమ్ము దులిపే యాక్టివిటీస్ పెట్టుకోకూడదు. శరీరానికి కాస్త రెస్ట్ ఇవ్వండి. దీని వల్ల ఇన్ఫెక్షన్ పై ఫైట్ చేయగలుగుతారు. లిక్విడ్స్ తాగండి: ఈ సమయంలో లిక్విడ్స్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఫ్లూయిడ్స్ బాడీను హైడ్రేట్ చేస్తాయి. లంగ్స్ లోని మ్యూకస్ ను లూజ్ చేస్తాయి. దాంతో, కఫము బయటికి సులభంగా వస్తుంది. ఎక్కువగా నీళ్లు తాగండి. పెద్ద మగ్ తో వెచ్చటి టీను సిప్ చేస్తూ ఉండండి. సూప్స్ ను సిప్ చేస్తూ ఉండండి. దగ్గును ఆపుకోకండి: ఈ సమయంలో దగ్గు అనేది ఎంతో అసౌకర్యానికి గురిచేస్తుంది. కానీ, దగ్గును ఆపుకోకూడదు. దగ్గు వల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. కాఫ్ మెడిసిన్ తో దగ్గును ఆపవద్దు. దగ్గు వల్ల విశ్రాంతి లభించకపోతే డాక్టర్ ను సంప్రదించండి. పొగకు దూరంగా ఉండండి:లంగ్స్ హీల్ అయ్యే వరకు పొగ నుంచి దూరంగా ఉండండి. స్మోకింగ్ చేయకండి. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కు కూడా దూరంగా ఉండండి. పొల్యూటెడ్ ఎయిర్ కు కూడా దూరంగా ఉంటే మంచిది. స్మోక్ ఎక్పోజర్ వలన భవిష్యత్తులో లంగ్ ప్రాబ్లెమ్స్ రావచ్చు. న్యుమోనియా మళ్ళీ తిరగబెట్టవచ్చు. వైద్యుల సూచనలు పాటించండి: మీ డాక్టర్ సూచనలను కచ్చితంగా పాటించండి. యాంటీబయాటిక్స్ వాడుతున్నట్టయితే డొసేజ్ ను అస్సలు మిస్సవ్వవద్దు. డొసేజ్ మిస్సయితే బాక్టీరియా అనేది మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. రికవరీ టైం ఎక్కువవుతుంది. భవిష్యత్తులో యాంటీబయాటిక్స్ పై రెసిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. శుభ్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వండి: చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోండి. జెర్మ్స్ ను దూరంగా ఉంచండి. దగ్గేటప్పుడు ఎల్బోను అడ్డంగా పెట్టుకోండి. తరచూ టచ్ చేసే రిఫ్రిజిరేటర్ హ్యాండిల్స్ వంటి వాటిని తరచూ శుభ్రం చేయండి. హైజీన్ తో సమస్యను మ్యాగ్జిమమ్ తగ్గించుకోవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ ను బలపరచుకోండి: సరైన నిద్ర, వ్యాయామమే అలాగే ఆరోగ్యకర ఆహారం వంటివి ఇమ్యూన్ సిస్టమ్ ను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. కాబట్టి, వీటిలో వేటినీ నిర్లక్ష్యం చేయకండి. వ్యాక్సినేషన్: కొన్ని రకాల న్యుమోనియా అలాగే ఫ్లూలను అరికట్టడానికి వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీ వైద్యునితో మాట్లాడి ఈ షాట్స్ తీసుకోండి. వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి వైద్యునితో మాట్లాడి సలహా తీసుకోండి. ఇలా సరైన సమయానికి డయాగ్నోసిస్ అలాగే సరైన కేర్ తో న్యుమోనియా నుంచి ఉపశమనం పొందవచ్చు. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


from Health Tips in Telugu: ఆరోగ్య చిట్కాలు, Health Care, Fitness & Diet Tips - Samayam Telugu https://ift.tt/3ngP5B7
దగ్గినప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంటుందా.. అయితే ఈ డేంజర్ వ్యాధి ఉందేమో జాగ్రత్త.. దగ్గినప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంటుందా.. అయితే ఈ డేంజర్ వ్యాధి ఉందేమో జాగ్రత్త.. Reviewed by Unknown on November 11, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.