సామాన్యం గా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే సమస్యే. రాత్రంతా బస్ లో కూర్చుని ప్రయాణం చేసినా, నిలబడి ఎక్కువ సేపు పని చేసినా పాదాలు వాయడం సర్వ సాధారణం. అలా కాకుండా కూడా పాదాల వాపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ హోం రెమిడీస్ ట్రై చేయండి. తగ్గకపోతే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అవసరం. ఒక్కొక్కసారి పాదాల వాపు ఇంకేదైనా సమస్యకి సూచన కావచ్చు. ఆ హోం రెమిడీస్ ఏమిటో తెలుసుకోండి. 1. మీరు మొట్టమొదటగా చేయవలసిన పని పాదాలు కొంచెం ఎత్తులో పెట్టుకోవడం. దీని వల్ల బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండి వాపు తగ్గుతుంది. మీరు పడుకున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా పాదాలు కాసేపు కుషన్ మీద పెట్టుకోండి. రోజూ కనీసం ఇరవై నిమిషాలైనా ఇలా చేయండి. 2. మీకు చాలా సేపు నిలబడి పని చేసే అలవాటుంటే, దాన్ని వెంటనే ఆపు చేయండి. ఎందుకంటే, ఈ అలవాటు వల్ల పాదాల మీద ప్రెజర్ పెరుగుతుంది. ప్రతి అర గంట కీ ఒకసారి బ్రేక్ తీసుకుని కాసేపు కూర్చోండి. ఇదే రూల్ ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారికి కూడా వర్తిస్తుంది. వారు ప్రతి అర గంట కీ ఒక సారి లేచి నిలబడి అటూ ఇటూ తిరగడం మంచిది. సహజంగా పాదాల వాపు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే వస్తుంది. అందుకని నిలబడడానికీ, కూర్చోడానికీ, తిరగడానికీ మధ్య బాలెన్స్ సాధించాలి. అతి సర్వత్ర వర్జయేత్ అని గుర్తుంచుకోండి. 3. నీరు ఎక్కువగా తాగండి. ఏసీ రూంలో కూర్చుని పని చేస్తున్నప్పుడూ, పీకలోతు పనిలో మునిగిపోయినప్పుడూ ఈ విషయం గుర్తుండదు. మర్చిపోతాం. అనుకనే, మీ డెస్క్ మీద ఒక బాటిల్ వాటర్ ఎప్పుడూ ఉంచుకోండి. అప్పుడు మీరు మర్చిపోకుండా నీరు తాగుతారు. శరీరానికి కావలసినంత నీరు మనం ఇవ్వకపోతే అది ఉన్న నీటిని దాచుకుంటుంది. దాంతో పాదాలూ, ఇతర శరీర భాగాలూ వాస్తాయి. కాఫీ, టీ తాగితే నీరు తాగినట్లు కాదని గుర్తు పెట్టుకోండి. 4. పాదాలు ఉప్పు నీటిలో కాసేపు ఉంచండి. ఎప్సం సాల్ట్ అయితే ఇంకా మంచిది. ఎప్సం సాల్ట్ మజిల్ పెయిన్ నీ, ఇంఫ్లమేషన్ నీ, స్వెల్లింగ్ నీ తగ్గిస్తుంది. ఇది శరీరం లోంచి టాక్సిన్స్ ని బైటికి లాగేస్తుందని చెప్తారు. దాంతో ఇది మంచి రిలీఫ్ గా ఉంటుంది. 5. చివరిగా, మీరు ఆహారం లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కూడా పాదాల వాపు వస్తుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టచ్చు. బ్రకోలీ, జీడి పప్పు, బాదం పప్పు, అవకాడో, డార్క్ ఛాక్లేట్, తోఫూ, పాల కూర వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలం గా లభిస్తుంది.
from Health Tips in Telugu: ఆరోగ్య చిట్కాలు, Health Care, Fitness & Diet Tips - Samayam Telugu https://ift.tt/3afORF5
పాదాల వాపు ఉంటే ఏదైనా జబ్బు ఉన్నట్టా.. తగ్గేందుకు ఏం చేయాలి..
Reviewed by Unknown
on
August 10, 2020
Rating:
No comments: