About

banner image
Seo Services

ఆల్కహాల్‌ ఒంటిపై స్ప్రే చేస్తే కరోనా వైరస్ రాదా..

కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో దాని చుట్టూ ఎన్నో కథనాలు పుట్టుకొచ్చి అవి కూడా భయపెడుతున్నాయి. ఇవే వాస్తవాలు అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఒకటే ఆల్కహాల్ స్ప్రే చేయడం.. శరీరమంతా ఆల్కహాల్ స్ప్రే చేస్తే కరోనా వైరస్ రాదని చెబుతున్నారు.. అయితే, దీనిపై ప్రపంచ ఆరోగ్యం సంస్థ స్పందించింది. మీ శరీరమంతా ఆల్కహాల్, క్లోరిన్ స్ప్రే చేసినంత మాత్రాన మీ శరీరంలోకి ప్రవేశించిన వైరస్లను చంపలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇలా చెబుతూనే కొన్ని సూచలను చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అవేంటంటే..కరోనా వైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే, మీ చేతులను తరచుగా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్‌, శానిటైజర్, సబ్బు, నీటిని ఉపయోగించి శుభ్రం చేయడం. భారతదేశంలో సుమారుగా 39 మంది వ్యక్తులు ఈ నావల్ కరోనా వైరస్ (COVID-19) తో బాధపడుతున్నారని నివేదిక. క్రమంగా దేశంలోని ప్రతి ఒక్కరూ ఒకింత భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అందుచేత, ఇంటర్నెట్‌లో దీని గురించి కనిపించిన ప్రతి రెమిడీని నమ్ముతున్నారు. సోషల్ మీడియా పోస్టులలో 'ఈ ప్రాణాంతక వైరస్‌ని చంపడానికి మద్యం తాగమని' ప్రచారం జరుగుతోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం నిజం కాదు. ఈ కొరోనా వైరస్ గురించిన అపోహలు, తప్పుడు సమాచారాల దృష్ట్యా, WHO ఇలా చెప్పింది: "మీ శరీరమంతా మద్యం, క్లోరిన్ స్ప్రే చేయడం, లేదా మద్యం సేవించడం ద్వారా మీ శరీరంలో ప్రవేశించిన వైరస్లు నాశనం కావు." గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం, అటువంటి పదార్థాలను స్ప్రే చేయడం వలన, బట్టలు, కళ్ళు నోటికి హానికరం. "ఆల్కహాల్, క్లోరిన్ రెండూ కూడా ఉపరితలాలను శుభ్రపరచే క్రమంలో భాగంగా, క్రిమిసంహారకంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. కానీ, వీటిని తగిన విధంగానే ఉపయోగించాలి" అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది. ఈ కొత్త కొరోనా వైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి గల అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే, మీ చేతులను తరచుగా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ వాష్, సబ్బు, శానిటైజర్, నీటితో కడగడం. వేడి నీటి స్నానం చేయడం ద్వారా కొరోనా వైరస్ నివారణ జరగదని, చైనా లేదా COVID-19 కేసులను నివేదించిన దేశాల నుండి పంపిణీ చేస్తున్న వస్తువుల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన లక్ష మంది పడ్డారని, ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికిపైగా ప్రాణాలను బలయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కొరోనా వైరస్ కేసుల సంఖ్య 101,492 కాగా, ఇప్పటికి 3,485 మంది మరణించారు. కానీ ఈ సంఖ్య, చనిపోయిన వ్యక్తుల వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పోల్చినప్పుడు, ఈ వైరస్‌ని మహమ్మారిగా గుర్తించలేమని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ప్రకటించింది. కాబట్టి భయాలను పక్కనపెట్టి, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, కనీస జాగ్రత్తలను పాటించండంటూ సూచిస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.


from Health Tips in Telugu: ఆరోగ్య చిట్కాలు, Health Care, Fitness & Diet Tips - Samayam Telugu https://ift.tt/2U4pn62
ఆల్కహాల్‌ ఒంటిపై స్ప్రే చేస్తే కరోనా వైరస్ రాదా.. ఆల్కహాల్‌ ఒంటిపై స్ప్రే చేస్తే కరోనా వైరస్ రాదా.. Reviewed by Unknown on March 11, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.