తన భర్త రామారావుకు నిద్రలో నడిచే అలవాటుందని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది సరోజ డాక్టర్ పరీక్షించి మెడిసిన్ రాసిచ్చాడు.. వారం రోజుల తర్వాత సరోజ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను కలిసింది ‘డాక్టర్.. నిద్రలో నడుస్తున్నాడని చెబితే మా ఆయనకు మెడిసిన్ ఇచ్చారు కదా’ అడిగింది ‘నేనిచ్చిన మందు బాగా పనిచేస్తుంది కదమ్మా’ డాక్టర్ గర్వంగా చూశారు ‘మా కొంప ముంచేలా పనిచేస్తోంది. ఇప్పుడు మా ఆయన నిద్రలో నడవటం మానేసి పరిగెత్తుతున్నారు డాక్టర్’ ఆవేశంగా సరోజ సమాధానం..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2omkxVv
Best Jokes: మందు తేడా కొట్టిందే!
Reviewed by Unknown
on
October 01, 2019
Rating:
No comments: